నాగార్జున పోషించిన పాత్రలో ప్రభాస్

Prabhas plays a role that Nag had done
Sunday, December 23, 2018 - 22:30

"మనం" సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగార్జున పాత్ర గుర్తుందా. ఓ జమీందార్ పాత్రలో కనిపించిన నాగార్జునకు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చితే ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా ఆ కారును సొంతం చేసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి పాత్రనే ఇప్పుడు ప్రభాస్ కూడా పోషిస్తున్నాడు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియ‌డ్ ల‌వ్‌ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో వింటేజ్ కార్లు కొనే ధనవంతుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ వివరాల్ని స్వయంగా వెల్లడించాడు.

1960ల్లో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుంది. ఒకేసారి 3 భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.