ప్రభాస్ ని అందుకోవడం కష్టమే!

Prabhas remuneration is too high
Saturday, December 28, 2019 - 15:15

సాహో సినిమా తెలుగులో ఆడకపోయినా హిందీలో కుమ్మేసింది. ప్రభాస్ స్టార్ డం ఏ రేంజ్ లో ఉందో చూపించింది. అందుకే.. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్, టి.సిరీస్ కలిసి 70 కోట్ల పారితోషికం ఇచ్చాయి ప్రభాస్ కి. మహేష్ బాబు ఇప్పుడిప్పుడే 45 కోట్ల రేంజ్ కి వచ్చాడు అది కూడా సరిలేరు నీకెవ్వరు మూవీ వరకే. ఆ తర్వాతి సినిమాకి అంత వస్తుందా అనేది డౌట్. 

చిరంజీవి పారితోషికం 50 కోట్లు అని చెప్తున్నారు. సైరా కి చరణ్ అంత అమౌంట్ వేసినట్లు టాక్. అది పూర్తిగా ఇంటి మేటర్. త్వరలో రీ-ఎంట్రీ ఇచ్చే పవన్ కళ్యాణ్ కూడా 50 వరకు తీసుకునే ఛాన్స్ ఉంది. సో.. మిగతా పెద్ద హీరోలందరితో పోల్చితే ప్రభాస్ అందనంత దూరంలో ఉన్నాడు. దానికి కారణం  ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉండడడమే. 

ప్రభాస్ ప్రస్తుతం 'జాన్' అనే సినిమా మొదలు పెట్టనున్నాడు. అది పూర్తయిన తర్వాత... ప్రభాస్ ఈ మైత్రి, టీ సిరీస్ సినిమా షురూ చేస్తాడు.