నవంబర్ 18 నుంచి ప్రభాస్ మూవీ

Prabhas to resume shoot from 18th November
Tuesday, November 5, 2019 - 23:00

ప్రభాస్ మళ్లీ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది మొదలు పెట్టి సగంలోనే ఆపేసిన ఆ సినిమాని మళ్ళీ టేకప్ చేశాడు. సాహో విడుదల అయిన తర్వాత మూడు నెలల విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఇప్పుడు బ్యాక్ టు యాక్షన్ అన్నమాట. 

ఈ నెల 18న షూటింగ్ షురూ అవుతుంది అట. హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇంతకుముందులా భారీ ఖర్చుతో తీయడం లేదు. హడావిడి తగ్గించి సినిమా నేరేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టమని దర్శకుడికి చెప్పాడు ప్రభాస్. ఈ సినిమాకి దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇతను ఇంతకుముందు గోపీచంద్ హీరోగా జిల్ అనే సినిమా తీసి ... ఈ ఛాన్స్ కొట్టాడు. 

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి చెందిన గోపికృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.