యాంకర్ కు క్లాస్ పీకిన ప్రభాస్

Prabhas scolds a TV anchor
Thursday, August 29, 2019 - 22:30

తీరిక లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రభాస్. ఇంకా చెప్పాలంటే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే వరకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఇలా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ ఎప్పుడూ సహనం కోల్పోలేదు. కూల్ గానే ఉన్నాడు. కానీ ఈ మొత్తం ప్రచార పర్వంలో ఒకే ఒక్కసారి కోప్పడ్డాడు. ఓ యాంకర్ పై చిన్న కోపం ప్రదర్శించాడు. 

ప్రభాస్, సదరు యాంకర్ పై కోపం ప్రదర్శించడానికి ఓ కారణం ఉంది. ఆమె సైరా, సాహోకు లింక్ పెట్టింది. అక్కడితో ఆగిపోతే బాగుండేది. సైరా మీద సాహో పైచేయి సాధిస్తుందని భావిస్తున్నారా అని అడిగింది. దీంతో ప్రభాస్ కు కోపం వచ్చేసింది. వెంటనే సుతిమెత్తగా మందలించాడు. 

"సైరా లాంటి సినిమాలకు మనం పైచేయి అనే వర్డ్ వాడకూడదు. వాళ్లు చాలా కష్టపడి సినిమా చేశారు. అది వేరే లెవెల్ సినిమా. మా సినిమాతో కంపేరిజన్ అవసరం లేదు. చిరంజీవి గారు లెజెండ్. ఆయన వేరు. మాది వేరు. సైరా ట్రయిలర్ చూశాను. ఎక్స్ టార్డనరీగా ఉంది."

ఇలా సింపుల్ గా ఆ టాపిక్ ను తెగ్గొట్టాడు ప్రభాస్. ఈ ఒక్క సమాధానంతో మెగాఫ్యాన్స్ మనసుదోచుకున్నాడు రెబల్ స్టార్. ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ కు సోషల్ మీడియాలో తెగ లైకులు పడుతున్నాయి. మెగాఫ్యాన్స్ అయితే ఎంత మంచి మనసు నీదంటూ ప్రభాస్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.