మ‌ళ్లీ భారీ టార్గెట్ సెట్ చేసిన ప్ర‌భాస్‌

Prabhas sets new target for other stars
Tuesday, June 4, 2019 - 15:30

ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి 2 సినిమాల క‌లెక్ష‌న్లు .... ఏ సినిమాకి, ఏ హీరోకి అంద‌నంత దూరంలో ఉన్నాయి. ఆ సినిమా కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల రూపాయ‌ల షేర్ అందుకొంది. రీసెంట్‌గా రంగ‌స్థ‌లం ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్ల‌తో 125 కోట్ల రూపాయ‌ల‌ను అందుకొంది నాన్‌-బాహుబ‌లి రికార్డును సెట్ చేసింది. అంటే ఆలోచించండి... బాహుబ‌లి 2 రికార్డులు అందుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో.

ఇత‌ర తెలుగు సినిమాల ప్ర‌పంచ‌వ్యాప్త క‌లెక్ష‌న్లు కూడా బాహుబ‌లి 2 తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల‌ను అందుకోవ‌డం గ‌గ‌న‌మై పోతుంది. ఆ రేంజ్‌లో బాహుబలి 2 బాక్సాఫీస్ సునామీని సృష్టించింది.

ఐతే బాహుబ‌లి 2 రికార్డుల‌కి చాలా కార‌ణాలున్నాయి. రాజ‌మౌళి మేజిక్‌, సినిమాలో ఉన్న ద‌మ్ము, ప్ర‌భాస్ చ‌రిష్మా, మొద‌టి భాగం సంచ‌ల‌నం సృష్టించ‌డం.. ఇలా చాలా కార‌ణ‌లున్నాయి. మ‌రి ప్ర‌భాస్ రాజ‌మౌళి పేరు లేకుండా కూడా ఆ రేంజ్ బిజినెస్ చేయ‌గ‌ల‌డా? ఈ ప్ర‌శ్నకి స‌మాధాన‌మా అన్న‌ట్లుగా సాహో వ్యాపార లెక్క‌లు క‌నిపిస్తున్నాయి. 

సాహో సినిమాని తెలుగునాట అమ్మేందుకు నిర్మాత‌లు విండో ఓపెన్ చేశారు. డిస్టిబ్యూట‌ర్లు ఆఫ‌ర్ చేస్తున్న ఎమౌంట్ చూస్తుంటే కేవ‌లం తెలుగునాటే ఈ సినిమా రూ.120 నుంచి రూ.150 కోట్ల‌ ప్రీరిలీజ్ బిజినెస్ చేసేలా ఉంద‌ట‌. అంటే ఇత‌ర హీరోల‌కి ప్ర‌భాస్ మ‌రో కొత్త టార్గెట్‌ని సెట్ చేస్తున్నాడ‌న్న‌మాట‌. ఫైన‌ల్‌గా ఇది చేసే బిజినెస్ ఎంత ఉంటుందో చూడాలి.