అంత సిగ్గెందుకు ప్రభాస్?

Prabhas is so shy!
Wednesday, January 2, 2019 - 19:30

మామూలుగానే ప్రభాస్ కు కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువ. కొత్త వ్యక్తులు కలిస్తే చాలా సిగ్గుపడిపోతాడు. కాఫీ విద్ కరణ్ షోలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. పక్కనే ఉన్న రానా, రాజమౌళి కూడా కన్ ఫర్మ్ చేశారు. అయితే ప్రభాస్ పీక్స్ లో సిగ్గుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఈ స్టిల్.

కార్తికేయ పెళ్లిలో ప్రభాస్-అనుష్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. సంగీత్ లో వీళ్లిద్దరి హంగామానే ఎక్కువగా నడిచిందనేది ఇన్ సైడ్ టాక్. ఈ సంగతి పక్కనపెడితే, అదే పెళ్లికి మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్ కూడా వచ్చింది. బాహుబలిని చూసిన వెంటనే అతడితో ఫొటో దిగాలని ముచ్చటపడింది.సుస్మితను చూసిన వెంటనే ప్రభాస్ ముడుచుకుపోయాడు.

ఫొటో చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమౌతూనే ఉంది. నెట్ లో ఈ ఫొటో చూసిన వాళ్లంతా "అంత సిగ్గెందుకు ప్రభాస్" అంటూ సెటైర్లు వేస్తున్నారు.