ప్ర‌భాస్ మ‌రీ ఇంత స్వీటా!

Prabhas is very sweet person, says Pooja Hegde
Tuesday, April 23, 2019 (All day)

ప్ర‌భాస్ అంత స్వీట్ హీరోని తాను చూడ‌లేదంటోంది పూజా హెగ్డే. ఇప్ప‌టికే ఈ భామ నాగ చైత‌న్య‌, వ‌రుణ్ తేజ్‌, హృతిక్ రోష‌న్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు వంటి ప‌లువురు హీరోల స‌ర‌స‌న న‌టించింది. కానీ ప్ర‌భాస్ మ‌రీ స్వీట్ గై అని అంటోంది మిగ‌తా స్టార్స్ క‌న్నా. 

బాహుబ‌లి చిత్రాల్లాంటి క‌ళ్లు చెదిరే బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇస్తే ఏ హీరో క‌ళ్లు అయినా నేల మీద ఆన‌వు. కానీ ప్ర‌భాస్ మాత్రం పూర్తిగా డిఫ‌రెంట్‌. ఆయ‌న అంత పెద్ద స్టార్‌లాగే ఉండ‌ర‌ని ఎంతో గొప్ప‌గా చెపుతోంది పూజా హెగ్డే. ఆమె ప్రస్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధాకృష్ణ కుమార్ డైర‌క్ష‌న్‌లో న‌టిస్తోంది. ఇది ఒక పీరియడ్ ప్రేమ‌క‌థా చిత్రం. అంటే సినిమా యూరోప్ నేప‌థ్యంగా సాగుతుంది. కథ అంటా 1970ల ప్రాంతంలోనే జ‌రుగుతుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌లేదు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ ఇటలీలో, మ‌రికొంత హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించారు.

ప్ర‌భాస్‌తో రెండు షెడ్యూల్‌లో పాల్గొన్న త‌ర్వాత ఆమె షాక్ తిన్న‌ద‌ట‌. ప్ర‌భాస్ ఇంత స్వీట్ హీరో అని అనుకోలేద‌ని చెపుతోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్‌ని బ‌ట్టి.... ఆయ‌న ఒక బిగ్‌స్టార్‌లానే బిహేవ్ చేస్తార‌నుకుంటే.. అస‌లు సాదాసీదాగా, అతి మ‌ర్యాద‌గా మాట్లాడ‌డం ఆమెకి ఆనందాన్నిచ్చింద‌ట‌.