ప్రభాస్ టైటిల్ ఉగాదికి

Prabhas20 title to be announced on Ugadi
Wednesday, March 11, 2020 - 11:15

ప్రభాస్ 20వ చిత్రం గురించి రకకాల వార్తలు చలామణిలో ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ప్రభాస్ సినిమా పీఆర్వోలు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని... ప్రభాస్ అభిమానులు గుస్సాగా ఉన్నారు. పీఆర్ విషయంలో ప్రభాస్ వీక్ అన్నది అందరికి తెలిసిందే. అందుకే, యువీ క్రియేషన్ ని ట్విట్టర్ లో అభిమానులు ఓ రేంజ్ లో ఆడుకుంటారు. ఇక ఈ టైటిల్ విషయంలో ఎక్కువ నాన్చకూడదు అని డిసైడ్ అయినట్లు ఉంది టీం. 

తాజా సమాచారం ప్రకారం... ఉగాదికి టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారంట. 

ఈ సినిమా గురించి మొదట వినిపించిన పేరు... అమోర్. కానీ ఈ స్పానిష్ నేమ్ ఎవరికీ అర్థం కాదు అని డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత చాలా కాలం 'జాన్' అనే పేరు వినిపించింది. అయితే, దిల్ రాజు "జాను" పేరుతో సమంత, శర్వానంద్ ల సినిమా రిలీజ్ చెయ్యడంతో దానిపై ప్రచారం ఆగింది. రీసెంట్ గా యువీ క్రియేషన్ "రాధే శ్యామ్", "ఓ డియర్" అనే పేర్లను రిజిస్టర్ చేయించింది. మరి ఈ నేమ్ ని ఫిక్స్ చేస్తుంది అనేది చూడాలి.