నా లవర్ కి పెళ్లి అయింది: ప్రదీప్

Pradeep Machiraju reveals about his first love
Saturday, March 14, 2020 - 16:45

పంచ్ లు వేయడంలో ప్రదీప్ తర్వాతే ఎవరైనా. అతడి షోలు అంతగా క్లిక్ అవ్వడానికి ఇదే కారణం. ఇప్పుడీ యాంకర్ హీరోగా కూడా మారాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్రచారం కోసం తన పీఆర్ మొత్తాన్ని బయటకులాగాడు ఈ స్టార్ యాంకర్. ఇందులో భాగంగా అలీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో తన లవ్ మేటర్ గురించి చాలా ఫన్నీగా బయటపెట్టాడు.

ప్రదీప్ ఫస్ట్ లవ్ ఎవరంటూ ప్రశ్నించాడు అలీ. దానికి తడుముకోకుండా సోనాలి బింద్రే అని సమాధానమిచ్చాడు ప్రదీప్. రియల్ లైఫ్ లో లవ్ ఎవరని ప్రశ్నించాడు అలీ. దీనికి ప్రదీప్ కాస్త కొంటెగా సమాధానం చెప్పాడు. "ఇప్పుడవన్నీ ఎందుకు సర్.. నా లవర్ కు పెళ్లయి, పిల్లలతో కలిసి నా షోలు కూడా చూస్తోంది." అంటూ సమాధానం ఇచ్చాడు. లవర్ డీటెయిల్స్ మాత్రం చెప్పలేదు.

తన ప్రేమ విషయాలతో పాటు పెళ్లి సంగతులు, తాగి డ్రైవ్ చేస్తూ దొరికిన సంగతుల్ని కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నాడు ప్రదీప్. దీంతో పాటు హీరోయిన్ ప్రియమణికి తనకు, రష్మికి సెపరేట్ గా ఓ వాట్సాప్ గ్రూప్ ఉన్న విషయాన్ని కూడా బయటపెట్టాడు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది