నా చెంప ప‌గిలింది: ప‌్ర‌కాష్ రాజ్‌

Prakash Raj sees humiliating defeat in Bengaluru central
Thursday, May 23, 2019 - 22:15

"జ‌స్ట్ ఆస్కింగ్" పేరుతో ప్ర‌కాష్‌రాజ్‌... కొన్నాళ్లూ సోష‌ల్ మీడియాలో చాలా హ‌ల్‌చ‌ల్ చేశారు. ప్ర‌ధాని మోదీని ఎదిరించే మొనగాడ్ని నేనే అన్న‌ట్లు హుంకరించారు. బెంగుళూరు సెంట్ర‌ల్‌లో ఇండిపెండెంట్‌గా నిలిచి త‌న స‌త్తా చాటుతాన‌ని ఎగిరెగిరి బోల్తాప‌డ్డారు. దారుణ ప‌రాజ‌యం ద‌క్కింది.

నోటాకి స‌మానంగా ఓట్లు వ‌చ్చాయి ఆయ‌న‌కి. ఇంకా చెప్పాలి అంటే ప్ర‌కాష్‌రాజ్‌ని ఎవ‌రూ కాన‌లేదు బెంగుళూరు సెంట్ర‌ల్‌లో. సినిమాల్లో మోనార్క్ కావొచ్చు... పొలిటిక‌ల్ య‌వ‌నిక‌పై ఎవ‌రు మోనార్కో చూపించారు బెంగళూరు ఓట‌రు. గూబ గుయ్యి మ‌న‌డంతో ఓట‌మ‌ని అంగీక‌రిస్తూ ట్వీట్ కూడా చేశారు ప్ర‌కాష్ రాజ్‌.

నా చెంప ప‌గిలింది. ఇంకా ఎక్కువ‌గా తిట్లు, శాప‌నార్థాలు త‌గులుతాయి నాకు. అవ‌మానాలు జ‌రిగినా... నా పంథాని మార్చుకోని. భార‌తదేశం లౌకిక దేశంగా ఉండేందుకు పోరాడుతూనే ఉంటాను. నా జ‌ర్నీ మ‌రింత క‌ష్ట‌త‌రం కాబోతుంద‌ని తెలుసు..ఐనా పోరాడుతాను..అంటూ మ‌రోసారి ప్ర‌కాష్‌రాజ్ ట్వీట్ వేశారు. 

చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌ని బీజేపీ వాళ్లు అపుడే ట్రోలింగ్ మొద‌లుపెట్టారు. ప్ర‌కాష్‌రాజ్ త‌నే నోటాకి మించి ఓట్లు తెచ్చుకోలేక‌పోయాడు..... ఇంకా వేరే వాళ్ల‌ని గెలిపిస్తాన‌ని కొన్ని రాష్ట్రాలు కూడా ప‌ర్య‌టించడం విశేషం.

ప్ర‌కాష్‌రాజ్‌తో పాటు ఆయ‌న భావ‌జాలంతో కూడిన క‌మ‌ల్‌హాస‌న్‌, క‌న్హాయ‌కుమార్‌ల‌కి కూడా అంతే ఘోర ప‌రాభ‌వం క‌లిగింది.