118...ఎంత వ‌స్తే సేఫ్‌?

Pre-release business of 118 movie
Thursday, February 28, 2019 - 20:00

కల్యాణ్ రామ్, షాలినీ పాండే, నివేత థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన 118 సినిమా శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈస్ట్  కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మించాడు.  11 రూపాయల బడ్జెట్ లో నిర్మించారట.

రిలీజ్‌కి ముందే నిర్మాత‌లు సేఫ్‌గా ఉన్నారు.  థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమాను 6 కోట్ల రూపాయలకు అమ్మారట. కానీ హిందీ డ‌బ్బింగ్‌, తెలుగు శాటిలైట్స్ ద్వారా మంచి ఎమౌంట్ వ‌చ్చింది. అందుకే రిలీజ్‌కి ముందు నిర్మాత‌కి పెద్ద టెన్స‌న్ లేదు. మ‌న ద‌గ్గ‌ర థియేట‌ర్‌లో ఎమౌంట్ డీసెంట్‌గా వ‌స్తే చాలు.  అటు ఓవర్సీస్ లో మాత్రం సొంత రిలీజ్ కు వెళ్తున్నారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. క‌ల్యాణ్‌రామ్‌కిది సేఫ్ ప్రాజెక్ట్‌

బడ్జెట్ - రూ. 11 కోట్లు
హిందీ డబ్బింగ్ - రూ. 4 కోట్లు
ఏపీ, నైజాం - రూ. 5 కోట్లు
సీడెడ్ - రూ. 1 కోటి
శాటిలైట్ - రూ. 3.10 కోట్లు (జెమినీ టీవీ)
హిందీ డబ్బింగ్ - రూ. 4 కోట్లు