నయనతారపై పెరుగుతున్న ప్రెజర్

Pressure mounting on Nayanthara
Sunday, September 15, 2019 - 15:45

నయనతార పెళ్లి గురించి కొన్ని ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పెళ్లి గురించి రాసి రాసి మీడియా అలిసిపోయింది కానీ ఆమె మాత్రం స్పందించడం లేదు. అలాగని తన బాయ్ ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ లేదు అని కూడా చెప్పడం లేదు. ఇద్దరు కలిసే ఉంటున్నారు. కలిసే అన్ని టూర్లు వేస్తున్నారు. తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ... విగ్నేష్ శివన్ ఇంట్లో నుంచి ఒత్తిడి మొదలైంది. ఇద్దరు తమ బంధానికి ఒక లైసెన్స్ లాంటిది కావాలని అని విగ్నేష్ తల్లి 
సతాయిస్తోందట. పెళ్లి గురించి నయనతార ఎదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఇప్పుడు. 

నయనతార వయసు కూడా పెరుగుతోంది. మరో రెండు నెలల్లో ఆమె 35లోకి అడుగుపెడుతుంది. బయోలాజికల్ క్లోక్ ని దృష్టిలో పెట్టుకొని పిల్లలని కనాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే విగ్నేష్ తల్లి ఎక్కువ ఒత్తిడి తెస్తోంది. మరి నయనతార వచ్చే ఏడాదిలో అయినా మూడు ముళ్ళు వేయించుకుంటుందా ఆ అనేది చూడాలి. 

ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించింది. ఏ హీరో అవసరం లేకుండా సొంతంగా సినిమాలను రన్ చెయ్యగలదు. అంతటి ఇమేజ్ ఉంది ఆమెకి. అందుకే కెరీర్ పైనే ఫోకస్ పెట్టి పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది.