బాలీవుడ్ లో ప్రియాకి రెండో చిత్రం

Priya Prakash Varrier signs second Bollywood film
Saturday, April 27, 2019 - 14:30

ప్రియా వారియర్ గురించి పరిచయం అక్కర్లేదు. అంతగా పాపులర్ అయింది ఈ కేరళ కుట్టి. ఇంకా నిండా పద్దెనిమిది నిండని ఈ బ్యూటీ "లవర్స్ డే" సినిమాకి సంబంధించిన ఒక పాటలో కన్ను మీటి అందరి గుండెని మీటింది.

ఆ ఒక్క పాటతో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్ అయింది. ఐతే "లవర్స్ డే" సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా విడుదల కన్నా ముందే ఆమె బాలీవుడ్ లో ఒక మూవీ చేసింది. అదే "శ్రీదేవి బంగ్లా". ఇది వివాదాల్లో ఇరుక్కొంది. శ్రీదేవి మరణాన్ని క్యాష్ చేసుకునేలా ఈ సినిమా ప్రయత్నం చేస్తోందనేది వివాదం.

ఇక ఇపుడు ఈ బ్యూటీకి రెండో హిందీ చిత్రం వచ్చింది. ఈ సినిమా పేరు "లవ్ హ్యకర్స్". మరి బాలీవుడ్ లోనైనా ప్రియా పైన్ అవుతుందా?