అప్పుడు వైరల్, ఇప్పుడు ట్రోలింగ్

Priya Prakash Varrier's kiss faces a backlash
Saturday, February 9, 2019 - 17:45

ప్రియా ప్రకాష్ వారియర్.. ఇంటర్నెట్ సెన్సేషన్ ఈ భామ. ఈమె కన్నుగీటిన సన్నివేశం ఇంటర్నెట్ ను ఊపేసింది. కోట్లలో లైక్స్ తెచ్చిపెట్టింది. ఫలితంగా గూగుల్ మోస్ట్ సెర్చింగ్ సెలబ్రిటీగా మారిపోయింది ప్రియా వారియర్. అయితే ఏ సినిమాలోనైతే కన్నుగీటే సన్నివేశంతో పాపులర్ అయిందో, ఇప్పుడు అదే సినిమాలో మరో సన్నివేశానికి సంబంధించి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది ఈ బ్యూటీ.

"లవర్స్ డే" సినిమాకు సంబంధించి తాజాగా మరో క్లిప్ రిలీజ్ చేశారు. ఆ క్లిప్ లో నటుడు రోషన్, ప్రియా వారియర్ పెదాల్ని గాఢంగా ముద్దాడుతాడు. సీన్ 10 సెకెన్లే ఉన్నప్పటికీ ఇంటర్నెట్ లో మరోసారి వైరల్ అయింది. అంతా బాగానే ఉంది కానీ వైరల్ అవుతుందనుకున్న ఈ సీన్ కాస్తా వివాదాస్పదమైంది.

స్కూల్ యూనిఫామ్ లో ఆ వేషాలేంటంటూ నెటిజన్లు ప్రియా వారియర్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. యూనిఫాంలో అలాంటి సన్నివేశాలు తీసి సమాజానికి ఏం చెబుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరీ ముఖ్యంగా లిప్ కిస్ సన్నివేశాన్ని స్లో మోషన్ లో చూపించడం, ప్రియా వారియర్ పెదవిని రోషన్ అలా మెల్లగా ముద్దాడుతూ వదలడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

దీనికి సంబంధించి ప్రియా వారియర్ పై కొంతమంది నెటిజన్లు దారుణంగా (ఇక్కడ రాయడానికి వీల్లేని విధంగా) స్పందిస్తున్నారు. మొన్నటివరకు వైరల్ వీడియోతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియా వారియర్, ఈ ముద్దు సీన్ సృష్టించిన వివాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.