ఫైన‌ల్‌గా ఈ పిల్ల సినిమా వ‌స్తోంది!

Priya Prakash Varrier's movie as Lover's Day in Telugu
Saturday, December 22, 2018 - 19:30

అమ్మాయి క‌న్నుగీటితే ఎంత‌టి వాడైనా ప‌డిపోతాడు. కేర‌ళ క్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కి ఈ విష‌యంలోనే క్రేజ్ వ‌చ్చింది. ఆమె క‌నుసైగ‌ల‌తో పాపుల‌ర్ అయింది.

ప్రియా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్‌` ట్ర‌యిల‌ర్ 2018 ప్రారంభంలో విడుద‌లైంది. ఆ సినిమా ట్ర‌యిల‌ర్లో ఆమె ఓ కుర్రాడికి క‌న్నుగీటే సీన్ వైర‌ల్ అయింది. ఒక్క‌సారిగా ఆ సినిమాకి క్రేజ్ వ‌చ్చింది. ఆమె ఓవ‌ర్‌నైట్ స్టార్ అయింది. అయితే ఆ సినిమా అప్ప‌టు నుంచి విడుద‌ల కాలేదు. ఇపుడు మొత్తానికి తెలుగులో డ‌బ్ అయి విడుద‌ల కానుంది. . ఈ చిత్రాన్ని తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది.

వేలంటైన్స్ డే సంద‌ర్భంగా  ఫిబ్ర‌వ‌రి 14న  తెలుగులో `ల‌వ‌ర్స్ డే` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నామ‌ని మేక‌ర్స్ చెప్పారు. సో ప్రియా ప్ర‌కాష్ తెలుగులో డెబ్యూ అవుతోంది.