ఫైన‌ల్‌గా ప్రియా ప్ర‌కాష్‌కి తెలుగు సినిమా

Priya Varrier first Telugu film launched
Sunday, June 23, 2019 - 11:00

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. క‌న్నుగీటి కుర్రాళ్ల మ‌నసు దోచుకున్న కేర‌ళ కుట్టి నితిన్ సినిమాని సైన్ చేసింది. ఆ సినిమా ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. నితిన్ హీరోగా ఐతే, అనుకోకుండా ఒక రోజు చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తీస్తున్న కొత్త సినిమాలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తోంది ప్రియా ప్ర‌కాష్‌. తెలుగులో ఆమెకిది మొద‌టి సినిమా. 

ఆమె న‌టించిన మొద‌టి మ‌ల‌యాళ చిత్రం (తెలుగులో ల‌వ‌ర్స్‌డే పేరుతో డ‌బ్ అయింది) విడుద‌ల‌కి ముందు ఎంతో క్రేజ్ వ‌చ్చింది. బ‌న్ని సినిమా స‌హా పెద్ద సినిమాల‌న్నింటిలో ఆమె న‌టించ‌నుందని ప్ర‌చారం జ‌రిగింది. అపుడు ఆమెకి ఆ రేంజ్‌లో పాపులారిటీ ఉంది మ‌రి. ఐతే ఆమె మొద‌టి సినిమా దారుణంగా ప‌రాజ‌యం పాలు కావ‌డం, ఆమె న‌ట‌న‌కి పెద్ద‌గా మార్కులు రాక‌పోవ‌డంతో ఫిల్మ్‌మేక‌ర్స్ అంతా వెన‌క‌డుగు వేశారు. ఐతే ఏలేటి మాత్రం ఆమెకి రెండో హీరోయిన్‌గా చాన్స్ ఇచ్చాడు. మొద‌టి హీరోయిన్‌గా ర‌కుల్ న‌టిస్తోంది.

ఈ సినిమా క్లిక్ అయితే.. ప్రియాకి తెలుగులో మంచి అవ‌కాశాలు ఉంటాయి. కేర‌ళ నుంచి వ‌చ్చి తెలుగులో ఎంతో సక్సెస్ చూసిన హీరోయిన్ల సంఖ్య త‌క్కువ కాదు.