తొలి హీరోతో ప్రేమ‌లో ప‌డిందా?

Priya Varrier hinting something about Roshan?
Tuesday, April 30, 2019 - 19:45

తొలి సినిమా హీరోతోనే ప్రేమ‌లో ప‌డే హీరోయిన్ల సంఖ్య చాలా ఎక్కువే. స‌మంత ఏకంగా త‌న తొలి సినిమా హీరో చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లాడింది. వాల‌కం చూస్తుంటే... ప్రియా వారియ‌ర్ కూడా త‌న తొలి సినిమా హీరో రోష‌న్‌పై డీప్ ల‌వ్‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇద్ద‌రూ టీనేజ‌ర్సే. 

"ల‌వ‌ర్స్ డే" సినిమాలో హైస్కూల్ విద్యార్థులుగా, టీనేజ్ ల‌వ‌ర్స్‌గా న‌టించారు. మొద‌ట ప్రియా వారియ‌ర్‌కే క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత రోష‌న్‌ని కూడా ఇష్ట‌ప‌డే అమ్మాయిల సంఖ్య పెరిగింది. సినిమా విడుద‌లైన త‌ర్వాత ఈక్వెష‌న్స్ మారాయి. సినిమా దారుణంగా ప‌రాజ‌యం పాలు కావ‌డంతో నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు...అంద‌రూ ప్రియాని విమ‌ర్శించారు. ఆ టైమ్‌లో నా స్నేహితుడు రోష‌న్ అండ‌గా నిల‌బ‌డ్డాడ‌నీ, అత‌నికి నా హార్ట్‌లో స్పెష‌ల్ ప్లేస్ ఉంటుంద‌నీ ఇటీవ‌లే అత‌ని బ‌ర్త్‌డే రోజు పోస్ట్ చేసింది. 

ఇపుడు వీరిద్ద‌రి ఫోటోల‌ను షేర్ చేస్తోంది త‌రుచుగా. ఇది క్ర‌ష్సా? ప‌్రేమా? అనేది చూడాలి.