ఆ దర్శకుడికి నేను బలి: ప్రియాంక

Priyanka says Taxiwaala director made her life miserable
Tuesday, November 13, 2018 - 17:00

"టాక్సీవాలా" సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతోంది ప్రియాంక జవాల్కర్. అనంతపురంలో పుట్టిపెరిగిన ఈ మరాఠీ అమ్మాయి, "టాక్సీవాలా" కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. దీంతో ప్రియాంకపై మీడియా ఫోకస్ పడింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. దర్శకుడు తనను వేధించాడని అంటోంది. దర్శకుడి దెబ్బకు తను బలైపోయానని అంటోంది.

"దర్శకుడు రాహుల్ పెర్ఫెక్షన్ కు నేను ఎక్కువ బలయ్యాను. ప్రతి షాట్ పెర్ఫెక్ట్ గా కావాలంటాడు. హెడ్ టర్న్ కూడా పెర్ఫెక్ట్ గా కావాలంటాడు. కానీ ఎప్పుడూ రాహుల్ తన టెంపర్ కోల్పోలేదు. సహనంగా అన్నీ చెప్పేవారు."

ఇలా దర్శకుడు రాహుల్ ను తిట్టినట్టే తిట్టి పొగిడేసింది ప్రియాంక.

తను కెమెరాకు కొత్త కాబట్టి, ఎన్నో సందర్భాల్లో రాహుల్ ను ఇరిటేట్ చేశానని, అయినప్పటికీ సహనం కోల్పోకుండా అన్నీ చెప్పేవాడని, డైలాగ్స్ కూడా ముందు రోజే ఇచ్చి కోపరేట్ చేశాడని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇలా రాహుల్ అతి కేరింగ్ కు తను బలి అయ్యాయని ముద్దుగా చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని "టాక్సీవాలా" ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పింది ఈ డెబ్యూ హీరోయిన్.