ధనుష్‌..నీ సినిమాలతో బతుకు బస్టాండే!

Producers slam on Dhanush's satements
Wednesday, September 4, 2019 - 18:45

తమిళ హీరో ధనుష్‌ తన నోరును కంట్రోల్‌లో పెట్టుకోలేదు. దాంతో అతను విసిరిన పంచ్‌ రివర్స్‌ స్వింగ్‌ అయి అతనికే తగిలింది. ఇంతకీ మేటర్‌ ఏంటంటే... ధనుష్‌ ఇటీవల తమిళ నిర్మాతలపై పంచ్‌ విసిరాడు. నిర్మాతల నుంచి పారితోషికం వసూల్ చేసుకోవాలంటే తల ప్రాణం తోకకి వస్తోందన్నాడు. చాలా మంది నిర్మాతలు ఒప్పుకున్న మనీని ఎగ్గొడుతున్నారని చెప్పాడు. ఈ మాటలతో తమిళ నిర్మాతలకి కాలింది. ఆయనతో సినిమాలు తీసిన పలువురు నిర్మాతలు ధనుష్‌పై విరుచుకుపడ్డారు.

"నీ కెరియర్‌లో ఎన్నో సినిమాలు చేశావు. కానీ ఎంతమంది నిర్మాతలు డబ్బులు తిన్నారో చెప్పగలవా? ఒక చేతికున్న వేళ్లని మించరు అలాంటి నిర్మాతలు. అదీ నీ స్టార్‌ స్టేటస్‌. నీ సినిమాలను నిర్మించి బతుకు బస్టాండ్‌ చేసుకున్న నిర్మాతలకి నువ్వు చేసిన సాయం ఏంటి..ఇపుడు పేద్ద వచ్చి నిర్మాతలను విమర్శిస్తున్నావు,'' అంటూ ఆయన పాత నిర్మాతలు ధనుష్‌ సినిమా హిస్టరీని తొవ్వి తీశారు.

ధనుష్‌ గాలి మొత్తం తీసేశారు నిర్మాతలు.