చిరంజీవి మంచోడు, నాగ‌బాబు కాదు

Prudhvi's comments on Chiru and Naga Babu
Thursday, June 20, 2019 - 15:45

మెగాస్టార్ చిరంజీవి నాకు ఆద‌ర్శం. మా జిల్లా నుంచి హీరోగా ఆయ‌న ఎదిగిన విధానం చూసే నేను న‌టుడ్ని కావాల‌నుకున్నా. ఇప్ప‌టికీ నాకు ఆయన అంటే అభిమానం, ఇలా మెగాస్టార్‌ని మున‌గ‌చెట్టు ఎక్కించాడు థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ. ఐతే, నాగబాబుపై మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. వైకాపాలో చేరి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేసినందుకు నాగబాబు త‌న‌ని టార్గెట్ చేశాడని అంటున్నాడు. త‌న‌ని రెండు సినిమాల్లో నుంచి తీయించేస్తా చూడు అని నాగ‌బాబు అంటుండ‌గా తాను విన్నాను అని చెపుతున్నాడు.

అంటే మెగా కుటుంబం మిమ్మ‌ల్ని టార్గెట్ చేసిందా అని అడిగితే...అబ్బే లేద‌ని స‌మాధానం ఇస్తున్నాడు. సైరా సినిమాలో న‌టిస్తున్నాను క‌దా అనేది వివ‌ర‌ణ‌. మ‌రి అల్లు అర్జున్ సినిమా నుంచి త్రివిక్ర‌మ్ తొల‌గించింది నిజ‌మేనా అంటే దాట వేస్తున్నాడు. 

మొత్తానికి థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ 30 ర‌కాలుగా మాట్లాడుతున్నాడు. న‌న్ను టార్గెట్ చేశారు, అందుకే బ‌న్ని సినిమా నుంచి తీసేశారు అని చెప్పాల‌నేది అత‌ని తాప‌త్రాయం. కాక‌పోతే... సైరాలో న‌టిస్తున్నాడు కాబ‌ట్టి అలా టార్గెట్ చేశారు అని చెప్పలేడు.