బయటకొచ్చినా ప్రేమను కురిపిస్తోంది

Punarnavi Bhupalam after Bigg Boss's exit
Wednesday, October 9, 2019 - 16:00

బిగ్ బాస్ హౌజ్ లో పునర్నవి, రాహుల్ మధ్య అనుబంధాన్ని అందరం చూశాం. వాళ్లు మాట్లాడుకునే విధానం, ఒకర్నొకరు పలకరించుకునే విధానం చూస్తే.. ఇద్దరి మధ్య ఏదో ఉందనే భావన అందరికీ కలిగింది. దీనికి తగ్గట్టే చాలా గాసిప్స్ కూడా పుట్టుకొచ్చాయి. అయితే గత వారం ఎలిమినేషన్స్ లో ఊహించని విధంగా రాహుల్ ను ఒంటరిని చేసి బయటకు వచ్చేసింది పునర్నవి. దీంతో వీళ్లిద్దరి అనుబంధం ఇక వీగిపోయిందని, ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా పునర్నవి తన ప్రేమను వీడలేదు. రాహుల్ కోసం ఇప్పుడామె ప్రచారం ప్రారంభించింది.

"ఇప్పుడు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వితిక తనను తాను సేవ్ చేసుకుంది కాబట్టి, రాహుల్-వరుణ్ కు మీ మద్దతు చాలా అవసరం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ చాలా టఫ్ అయిపోతోంది. 2-3 ఓట్లతోనే చాలామంది ఎలిమినేట్ అయిపోతున్నారు. సో.. దయచేసి రాహుల్-వరుణ్ కు ఓటేయండి."

ఇలా రాహుల్ తో పాటు వరుణ్ కు ఓట్లు వేయాలంటూ ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేసింది పునర్నవి. నిజానికి ఇదొక కొత్త మలుపు. ఎందుకంటే.. బిగ్ బాస్ సీజన్-3కు సంబంధించి ఇప్పటివరకు చాలామంది ఎలిమినేట్ అయ్యారు. అయితే బయటకు వచ్చిన వాళ్లంతా హౌజ్ మేట్స్ ను గాలికి వదిలేశారు. తమ రెగ్యులర్ వర్క్స్ లో పడిపోయారు. ఒక్క పునర్నవి మాత్రం బయటకొచ్చిన తర్వాత కూడా తన హౌజ్ మేట్స్ గురించి ఆలోచిస్తోంది. వాళ్ల కోసం ఇలా ప్రచారం స్టార్ట్ చేస్తోంది. అయితే ఇదంతా రాహుల్ పై ప్రేమతోనే చేస్తోందా లేక బిగ్ బాస్ పై ఇష్టంతోనా అనేది తేలాల్సి ఉంది.