వదల బాలయ్యా నిన్నొదల

Puri and Balakrishna combo again
Wednesday, January 23, 2019 - 19:00

మన పూరి జగన్నాధ్.. బాలయ్యను వదలట్లేదు. ఇప్పటికే బాలయ్యను తేడా సింగ్ గా చూపించిన పూరి, ఇప్పుడు మరో సినిమా కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. దీని కోసం అతడు చేస్తున్న ప్రయత్నాలు క్లియర్ గా తెలిసిపోతున్నాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కాగానే బాలయ్యకు మొట్టమొదట వెళ్లిన కాల్ ఎవరిదో తెలుసా? ఆ కాల్ చేసిన వ్యక్తి పూరి జగన్నాధ్. సినిమా చూశానని, సాక్ష్యాత్తూ పెద్ద ఎన్టీఆర్ ను చూసినట్టు ఉందంటూ పూరి, బాలయ్యను పొగిడేశాడు.

పూరి కాంప్లిమెంట్స్ బాలయ్య మైండ్ లో ఫిక్స్ అయ్యాయి. ఆ ప్రశంసల ప్రభావం వల్ల ఏదో ఒక రోజు పూరికి బాలయ్య పిలిచిమరీ అవకాశం ఇవ్వడం గ్యారెంటీ. మనం తేడా సింగ్ పార్ట్-2 చూడడం గ్యారెంటీ. ఈరోజే ఈ దర్శకుడు రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టార్ట్ చేశాడు. మే నెలలో ఇది రిలీజైన తర్వాత బాలయ్యను లైన్లో పెడతాడేమో చూడాలి.