పూరిని ఆడుకుంటున్న మహేష్ ఫ్యాన్స్‌

Puri gets trolled by Mahesh Babu's fans
Friday, July 19, 2019 - 23:15

హిట్లు ఇస్తున్న డైర‌క్ట‌ర్స్‌తోనే మ‌హేష్‌బాబు వ‌ర్క్ చేస్తాడ‌ని పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కామెంట్ క‌ల‌క‌లం రేపింది. పూరి, మ‌హేష్‌బాబు కాంబినేష‌న్ అంటే చాలా క్రేజ్ ఉంది. పోకిరి సినిమా ఇద్ద‌రి లైఫ్‌ని మార్చేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన బిజినెస్‌మేన్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బాగా సంద‌డి చేసింది. ఐతే... ఆ త‌ర్వాత పూరి ఎన్నిసార్లు వెళ్లి మ‌హేష్‌బాబుని క‌లిసినా.. ఎందుకో మ‌రోసారి వీరి కాంబినేష‌న్ సెట్ అవ్వ‌లేదు. 

ఐతే..దానికి పూరి మ‌హేష్‌బాబుని ఈ విధంగా నిందించ‌డం మాత్రం అభిమానుల‌కి రుచించ‌డం లేదు. హిట్లు ఇస్తూ మంచి ఫామ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడికే మ‌హేష్‌బాబు డేట్స్ ఇస్తాడంటే...మ‌రి పోకిరి ముందు పూరి ప‌రిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు. హిందీలో హిట్ట‌యిన ధూమ్ సినిమాకి న‌క‌లుగా సూప‌ర్ అనే సూప‌ర్ ఫ్లాప్ ఇచ్చిన త‌ర్వాతే క‌దా మ‌హేష్‌బాబు పూరితో పోకిరి చేశాడు అని అడుగుతున్నారు ఫ్యాన్స్‌. అలాగే ఏక్ నిరంజ‌న్‌, గోలీమార్‌, నేను నా రాక్ష‌సి, బుడ్డా హోగా తేరా బాప్ ...ఇలా వ‌రుస‌గా ఫ్లాప్‌లు ఇస్తున్న టైమ్‌లోనే క‌దా పూరిని మ‌లిచి మ‌రీ బిజినెస్‌మేన్ చేశాడు మ‌హేష్‌బాబు. బిజినెస్‌మేన్ సినిమా ఒప్పుకునేముందే మ‌హేష్‌బాబు దూకుడు వంటి సెన్సేష‌న‌ల్ సూప‌ర్‌హిట్ ఇచ్చి ఉన్నాడు. 

మ‌రి ఆ టైమ్‌లో అంత ఫ్లాప్స్‌ల‌లో ఉన్న పూరికి మ‌హేష్‌బాబు ఎలా సినిమా చేశాడ‌ట‌. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో పూరిని ఆడుకుంటున్నారు మ‌హేష్‌బాబు ఫ్యాన్స్‌