ఈసారి నందమూరి ఫ్యాన్స్‌తో సున్నం

Puri Jagannadh now targets NTR
Monday, July 22, 2019 - 18:30

మహేష్‌బాబుపై నెగిటివ్‌గా స్పందించి ఇప్పటికే సోషల్ మీడియాలో చీవాట్లు తిన్నాడు పూరి జగన్నాధ్. అయినప్పటికీ హీరోల గురించి రియాక్ట్ అవ్వడం మాత్రం ఆపలేదు. ప్రతి హీరోపై తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని నిక్కచ్చిగా బయటపెడుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ గురించి పూరి చెప్పిన ఒక మాట ఇప్పుడు నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. 

"టెంపర్ టైమ్ లో ఎన్టీఆర్ తో ట్రావెల్ చేశాను. ఆ సినిమా కోసం గోవాలో షూట్ చేశాం. సాయంత్రమైతే మమ్మల్ని కారు ఎక్కించుకునేవాడు. చాలా స్పీడ్ గా వెళ్లేవాడు. ఆ కారులో వెళ్లడం కంటే నడిచి వెళ్లడం బెటర్ అనిపించేంది. అంత ఫాస్ట్ గా వెళ్లేవాడు"

ఇక్కడితో సంభాషణ ఆపేస్తే సరిపోయేది. కానీ అక్కడున్నది పూరి జగన్నాద్. అక్కడితో ఎందుకు ఆగుతాడు. యాంకర్ రెట్టించి అడగడంతో మరింత రెచ్చిపోయాడు. జాగ్రత్తగా బండి నడపండి, మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయని తారక్ సందేశం ఇస్తుంటాడు కదా, అలాంటి వ్యక్తి అంత రాష్ గా డ్రైవ్ చేస్తాడా అని యాంకర్ రెట్టించి అడిగింది. దానికి పూరి అంతే లైట్ గా సమాధానమిచ్చాడు. అలాంటివన్నీ ఎన్టీఆర్ ఊరికే చెబుతాడు తప్ప, పాటించడని అన్నాడు.

సరిగ్గా ఇక్కడే నందమూరి ఫ్యాన్స్ కు కాలింది. మొన్నటివరకు మహేష్ ఫ్యాన్స్ తీసుకున్న బాధ్యతను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్నాడు. సోషల్ మీడియాలో పూరిని చీల్చిచెండాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోమని కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు.