కామా లేదు గామా ఉంది!

Puri registers Vasco da Gama title for next film
Monday, September 3, 2018 - 21:00

పూరి జ‌గ‌న్నాథ్ త‌న డైర‌క్ష‌న్‌కి ఇక కామానో ఫుల్‌స్టాపో పెట్టిన‌ట్లే అనిపించింది ఈ మ‌ధ్య‌. ఎందుకంటే ఆయ‌న సినిమాల‌న్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అవుతున్నాయి. దానికితోడు కొడుకును హీరోగా పెట్టి తీస్తే (మెహ‌బూబా అనే మూవీ) కూడా ప‌రువు నిల‌వ‌లేదు. దాంతో పూరి కొన్ని నెల‌ల పాటు సినిమా డైర‌క్ష‌న్‌కి దూరంగా ఉంటాడ‌ని టాక్ వినిపించింది.

కానీ తిరిగే కాలు, తినే నోరు ఆగ‌ద‌న్న‌ట్లు.. సినిమానే జీవితం, సినిమానే శ్వాస‌గా భావించే పూరిలాంటి డైహార్డ్ ఫిల్మ్‌ల‌వ‌ర్స్ సినిమాల‌కి దూరంగా ఎలా ఉండ‌గ‌ల‌రు. అప్పోస‌ప్పో చేసి సినిమా తీయాల్సిందే. పూరి కూడా అదే చేస్తున్నాడిపుడు. కొత్త థాట్స్‌తో వాస్కోడిగామా అంటూ ఒక మూవీ మొద‌లుపెడుతున్నాడు.

ఇందులో అంద‌రూ కొత్త‌వాళ్లే ఉంటార‌ట‌. ప్ర‌ధాన పాత్ర మాత్రం కొడుకు ఆకాష్ పూరికే ద‌క్కుతుంది.