శ్రుతిదే త‌ప్పు, నాది కాదు: పీవీపీ

PVP clarifies on Shruti Haasan issue
Monday, April 1, 2019 - 14:00

హీరోయిన్ శ్రుతి హాస‌న్‌తో పాటు ప‌లువ‌రు స్టార్స్‌ని బెదిరించాన‌ని త‌న‌పై ఎంపీ నాని చేసిన‌ ఆరోప‌ణ‌ల‌ను నిర్మాత పీవీపీ తోసిపుచ్చారు. పీవీపీ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. విజ‌య‌వాడ ఎంపీగా వైకాపా త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు పీవీపీ. ఆయ‌న‌కి పోటీగా ఉన్న తెలుగుదేశం అభ్య‌ర్తి నాని ఇటీవ‌ల తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. శ్రుతి హాస‌న్ త‌మ సంస్థ‌కి అడ్వాన్స్ ఇచ్చేలా వేధించారన్నారు. దాంతో పీవీపీ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు.

"షూటింగ్ మ‌ధ్య‌లోనే శ్రుతి హాస‌న్ వెళ్లిపోయింది (ఊపిరి సినిమా). త‌ప్పు ఆమెదే. అందుకే పారితోషికం తిరిగి తీసుకున్నాం. అందులో త‌ప్పు ఏముంది. అనుష్క‌, త‌మ‌న్న‌, స‌మంత‌... ఇలా ఎంద‌రో పెద్ద హీరోయిన్లు మా సంస్థ‌లో ప‌ని చేశారు. ఎవ‌రూ ఆరోప‌ణ‌లు చేయ‌లేదు క‌దా. నాని ఇలాంటి త‌ప్పుడు మాట‌లు బంద్ చేయాలి," అని పీవీపీ ఘాటుగా స్పందించారు.

"తెలుగు రాష్ట్రాలలో నన్ను ఇబ్బంది పెట్టేంత క‌లాపాలు ఏమీ లేవు నా పిలక ఏ ప్రభుత్వం చేతిలో పెట్టాల్సిన అవసరంలేదు.. ..అవసరం రాలేదు. నేను అలా చేసుకోను కూడా," అని తెలిపారు పీవీపీ.