వైకాపాలో చేర‌నున్న పీవీపీ

PVP to contest Vijayawada parliamentary seat
Tuesday, March 12, 2019 - 14:45

వై.ఎస్‌.జ‌గ‌న్ పార్టీలోకి టాలీవుడ్ సెల‌బ్రిటీల చేరిక‌లు మొద‌ల‌య్యాయి. ఈ పార్టీలో ఇప్ప‌టికే క‌మెడియ‌న్ పృధ్వీ ఉన్నాడు. పోసాని కృష్ణ ముర‌ళి పార్టీ మెంబ‌ర్ కాదు కానీ జ‌గ‌న్ సానుభూతి ప‌రుడు. వైకాపాలోకి రీసెంట్‌గా క‌మెడియ‌న్ అలీ చేరాడు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత పీవీపీ వైకాపాలో చేరుతున్న‌ట్లు స‌మాచారం.

ఊపిరి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ నిర్మించిన పీవీపీ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానానికి వైకాపా త‌ర‌ఫున పోటీ చేస్తార‌ట‌. ఆయ‌న గ‌తంలోనూ విజ‌య‌వాడ ఎంపీ సీటు కోసం ప్ర‌య‌త్నించారు. ఐతే ఇపుడు సీటు ఇచ్చేందుకు వైఎస్ జ‌గ‌న్ అంగీక‌రించ‌డంతో ఆయ‌న పార్టీలో చేర‌బోతున్న‌ట్లు టాక్‌. ఈ నెల 23న త‌న నామినేష‌న్‌ని ద‌ఖ‌లు చేస్తార‌ట‌.

పీవీపీ పుట్టింది, పెరిగింది విజ‌య‌వాడ‌లోనే. అమెరికా వెళ్లి అంటర్‌ప్రూన్య‌ర్‌గా మారి కోట్లు సంపాదించారు. త‌ర్వాత సినిమా నిర్మాణంలోకి వ‌చ్చారు. విజ‌య‌వాడ‌లో పీవీపీ మాల్ కూడా నిర్మించారు.