టికెట్ లు అమ్మిన రాశి ఖన్నా

Raashi Khanna sells tickets at Gokul Theater
Wednesday, December 18, 2019 - 18:15

అభిమానులు పండగ చేసుకున్నారు. అందాల రాశి ఖన్నా ఏకంగా థియేటర్ కౌంటర్లో కూర్చొని తమకి టికెట్లు అమ్మడంతో సాధారణ అభిమానులు ఖుషి అయ్యారు. రాశి ఖన్నా ఈ రోజు హైదరాబాద్‌లోని గోకుల్‌ థియేటర్‌ కి వెళ్లి అక్కడ టికెట్లని అమ్మారు.  ‘ప్రతి రోజూ పండగే’ సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేసింది.
 
ఈ సినిమా టీం ... ప్రచారంలో ముందుంది. సాయి  తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా  ఈ శుక్రవారం విడుదల కానుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీకి నిర్మాత బన్నీ వాసు. . సత్యరాజ్ తాతయ్య పాత్ర పోషించారు. 

గతవారం ఆమె నటించిన వెంకీ మామ సూపర్ ఓపెనింగ్స్ తెచ్చుకొంది. ఈ సినిమా కూడా ఆడితే... రాశికి 2019 మంచి ఎండింగ్ అవుతుంది. అందుకే రాశి ఖన్నా ...ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది.