రాశి అందాల షో ప్ర‌య‌త్నం

Raashi Khanna trying to woo offers
Sunday, June 30, 2019 - 11:30

రాశి ఖ‌న్నాకి స‌రైన బ్రేక్ రావ‌డం లేదు. చాలా కాలం నుంచి టాప్ లీగ్‌లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది కానీ ఏదీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఎన్టీఆర్ స‌ర‌స‌న జైల‌వ‌కుశ‌, త‌మిళంలో విశాల్ స‌ర‌స‌న అయోగ్య వంటి చిత్రాలు చేసినా.... టాప్ హీరోయిన్ అనిపించుకోలేదు. దాంతో మ‌ళ్లీ మిడిల్ రేంజ్ హీరోల‌తోనే న‌టిస్తోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ప్ర‌తిరోజు పండ‌గే అనే సినిమా చేస్తోంది.

అయితే గ్లామ‌రస్‌గా మారి తాను అందాల షోకి రెడీ అని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది చాలా కాలంగా. ఎప్ప‌టిక‌పుడు ఎక్స్‌పోజింగ్‌తో కూడిన ఫోటోసూట్‌ల‌ను షేర్ చేస్తోంది. పెద్ద హీరోయిన్ అనిపించుకోవాల‌నేది ఆమె క‌ల‌లా ఉన్న‌ట్లుంది. 

ఒక‌పుడు చబ్బీగా ఉండేది. ఇపుడు స్లిమ్ అయింది. స్లిమ్‌తో పాటు గ్లామ‌ర్ షోకి రెడీ అంటూ హింటు ఇస్తోంది. మ‌రి ఆమె క‌ల నెర‌వేరేనా?