అసలైన రంగమ్మత్త ఎవరో తెలుసా?

Raasi was the first choice for Ranaggamtta?
Saturday, November 9, 2019 - 16:15

"రంగస్థలం" సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయ, ఆ సినిమాతో బీభత్సంగా పేరు తెచ్చుకుంది. క్షణం తర్వాత అనసూయకు లైఫ్ టైమ్ క్రేజ్ తీసుకొచ్చిన క్యారెక్టర్ అది. అయితే నిజానికి ఆ పాత్ర అనసూయ కోసం రాయలేదు. ముందుగా ఆ పాత్ర కోసం ఒకప్పటి హీరోయిన్ రాశిని అనుకున్నారు. ఆమెను సంప్రదించారు కూడా. ఈ విషయాన్ని స్వయంగా రాశి బయటపెట్టింది.

"అవును.. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర కోసం నన్ను సంప్రదించారు. ఆ పాత్ర గురించి ముందుగా నాతోనే చర్చలు జరిపారు. కానీ పాత్ర పరంగా ఆ క్యారెక్టర్ లో మోకాలు వరకు చీరలాంటిది కట్టుకోవాల్సి ఉంటుంది. అది నాకు నచ్చలేదు. అలాంటి డ్రెస్సింగ్ నాకు సూట్ అవ్వదు. అందుకే తిరస్కరించాను."

ఇలా ఆ పాత్రను తిరస్కరించిన విషయాన్ని బయటపెట్టింది రాశి. మరోవైపు తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాపై కూడా స్పందించింది. సెట్స్ పైకి వెళ్లేవరకు తనది నెగెటివ్ రోల్ అనే విషయం తెలియదని.. హీరో-విలన్ మధ్య తన పాత్ర వస్తుందని, గోపీచంద్ తో లవ్ సీన్స్ ఉంటాయని చెప్పిన తేజ తనను మోసం చేశాడని ఆరోపించింది రాశి.