తొలి వికెట్ ప‌డింది..ద‌ర్శ‌కేంద్రుడి రాజీనామా

Raghavendra Rao resigns as SVBC chairman
Monday, May 27, 2019 - 16:15

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేసిన‌ట్లు తెలిపారు. ఆయ‌న చెప్పిన కార‌ణం ఏదైనా..అస‌లు విష‌యం మాత్రం వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావ‌డ‌మే. రాఘ‌వేంద్ర‌రావు తెలుగుదేశం పార్టీ స‌పోర్ట‌ర్‌. ఎన్టీఆర్ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి త‌న వంతు ప్ర‌చారం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన నామినేటెడ్ ప‌దవి ఇది. కాబ‌ట్టి వెంట‌నే రాజీనామా చేశారు.

మే 30న జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. రాగానే గ‌త ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వులు స్వీక‌రించిన వారంద‌ర్నీ ఇంటికి పంపించేస్తారు. త‌న‌ని రాజీనామా చేయ‌మ‌ని అడిగేలోపే..రాఘ‌వేంద్ర‌రావు త‌ప్పుకున్నారు. టీ టీ డి యాజమాన్యానికి, సిబ్బందికి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలన్నారు ద‌ర్శ‌కేంద్రుడు.