విలన్ గా మారుతున్న రఘుకుంచె

Raghu Kunche dons villain's role
Thursday, July 4, 2019 - 15:45

యాంక‌ర్‌గా, సింగ‌ర్‌గా ఎంతో పాపుల‌ర్ అయిన ర‌ఘుకుంచె ఇపుడు మ‌రో అవ‌తారంలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఇప్ట‌టికే మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌గా మారాడు. నిర్మాత అవ‌తార‌మెత్తాడు. తాజాగా విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. ‘‘పలాస 1978’’ అనే కొత్త మూవీలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నాడు. 

ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడు కూడా ఆయ‌నే. ఈ సినిమా  మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ కు... రఘు విలన్ పాత్ర కు సూటవుతారని అనిపించింది. ఈ సినిమాలో 30-40-50-70 ఇలా ప‌లు వ‌య‌సు గెట‌ప్‌ల‌లో కనిపిస్తాడ‌ట‌. 

రియలిస్టిక్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ చిత్రంలో కొత్త జంట న‌టించింది. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది.