పునర్నవి చెంతకు చేరిన రాహుల్

Rahul parties hard with Punarnavi RAvi
Monday, November 4, 2019 - 19:00

బిగ్ బాస్ హౌజ్ లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య జరిగిన వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. అర్థరాత్రి దాటినా ఇద్దరూ కలిసి ఒకటే ఇకఇకలు, పకపకలు, ఊసులాటలు. వాళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంటూ హౌజ్ లో కంటెస్టంట్లే అనుమానపడ్డారంటే విషయం ఎంత దూరం వెళ్లి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో తన ఆటను కూడా వదిలేసి పున్నూ చుట్టూ తిరిగేవాడు రాహుల్. ఆమె కోసం ఏకంగా ఎలిమినేట్ కూడా అయ్యాడు.

అలా పున్నూపై తన అభిమానాన్ని చాటుకున్నాడు రాహుల్. ఆ తర్వాత నిజంగానే ఎలిమినేట్ అయిన పునర్నవి కూడా రాహుల్ పై తన ప్రేమను చాటుకుంది. బయటకొచ్చిన తర్వాత రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేసింది. అతడికి ఎక్కువ ఓట్లు పడేలా చాలా కష్టపడింది. అలా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

విన్నర్ గా బయటకొచ్చిన తర్వాత రాహుల్ ఏం చేస్తాడనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఇలా గెలిచాడో లేదో అలా పునర్నవి చెంతకు చేరిపోయాడు రాహుల్. వీళ్లిద్దరూ కలిసి ఎంచక్కా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో వరుణ్ సందేశ్, అతడి భార్య వితికి, మరికొంతమంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హౌజ్ లోనే ఉన్నట్టుగానే ఈ పిక్స్ లో కూడా రాహుల్, పునర్నవి ఒకర్నొకరు అతుక్కుపోయారు.