మళ్ళీ ట్రెండయిన రాహుల్-పున్నూ

Rahul Sipligunj and Punarnavi dance together at Prakash Raj's party
Monday, December 30, 2019 - 09:15

తమ మధ్య ఏమీ లేదంటూనే తెగ రాసుకుపూసుకు తిరుగుతున్నారు రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి. బిగ్ బాస్ హౌజ్ లో వీళ్లిద్దరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టైటిల్ విన్నర్ గా రాహుల్ బయటకొచ్చిన తర్వాత పున్ను ఇతడికి మరింత క్లోజ్ అయిపోయింది. ఇద్దరూ కలిసి ఇప్పటికే చాలా ఛానళ్లకు జాయింట్ గా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అలా కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ జంట, తాజాగా మరోసారి వైరల్ అయింది.

ఈమధ్యే నటుడు ప్రకాష్ రాజ్, తన ఫామ్ హౌజ్ లో గ్రాండ్ గా క్రిస్మస్ పార్టీ ఇచ్చిన విషయాన్ని telugucinema.com వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో చిన్న మ్యూజికల్ నైట్ కూడా జరిగిన విషయాన్ని బయటపెట్టాం. ఆ పార్టీలో ఆడిపాడింది మరెవరో కాదు, రాహుల్-పున్నూ జోడీనే ఆరోజు రాత్రి ఫుల్ హంగామా చేశారు. ఆ ఫొటోల్ని రాహుల్ ఎట్టకేలకు బయటపెట్టాడు.

ఇంతకీ ఈ ఫామ్ హౌజ్ పార్టీకి, రాహుల్ కు సంబంధం ఏంటో తెలుసా? కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ సినిమాలో రాహుల్ కూడా ఓ చిన్న రోల్ పోషిస్తున్నాడట. అందులో కీలక పాత్ర ప్రకాష్ రాజ్ ది అనే విషయం తెలిసిందే. అలా రమ్యకృష్ణతో సహా వీళ్లంతా కలిసి ఆ రోజు రాత్రి ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు.