ఇవి రంగమార్తాండ లీకులు

Rahul Sipligunj reveals about Rangamarthanda
Saturday, April 25, 2020 - 18:15

ప్రస్తుతం "రంగమార్తాండ" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. నానాపటేకర్ నటించిన మరాఠీ సినిమాకు రీమేక్ ఇది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అతడే ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటపెట్టాడు.

సినిమాలో నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్‌ నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కు అల్లుడిగా రాహుల్ సిప్లిగంజ్ కనిపించబోతున్నాడట. ఇక ప్రకాష్ రాజ్ కూతురిగా రాజశేఖర్ కూతురు శివాత్మిక, భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారట. ప్రకాష్ రాజ్‌ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తాడట. ఈ పాత్రల మధ్య మానసిక సంఘర్షణే రంగమార్తాండ సినిమా అంటున్నాడు రాహుల్.

నిజానికి ఈ సినిమా మరాఠీ వెర్షన్ ను చాలామంది చూసేశారు. కాబట్టి పాత్రల పేర్లు బయటపెట్టడం పెద్దగా లీకులు అనిపించుకోవు. కాకపోతే పాత్రల కంటే ఎమోషన్ చూడాలంటున్నాడు రాహుల్. మరీ ముఖ్యంగా సినిమాలో తన సీన్స్ అన్నీ ప్రకాష్ రాజ్ తోనే ఉంటాయని.. ఆయనతో నటించడం పెద్ద సవాల్ అంటున్నాడు రాహుల్. ఓవైపు కృష్ణవంశీ, మరోవైపు ప్రకాష్ రాజ్ ఉండడంతో నటుడిగా తనకు పెద్ద ప్లస్ అవుతోందంటున్నాడు రాహుల్.