మ‌ళ్లీ దిల్‌రాజు క్యాంప్‌లో తేలిన రాజ్ త‌రుణ్‌

Raj Tarun lands in Dil Raju camp
Friday, March 15, 2019 - 17:15

ఒకపుడు వరుస సినిమాలతో చిన్న సినిమాలకి పెద్ద హీరో అనిపించిన రాజ్ తరుణ్ కెరియర్ ఇపుడు మొత్తంగా సమస్యల్లో పడింది. ఒక్క ఆఫర్ రావడం లేదు. దాంతో చేసేదేమీ లేక మళ్లీ దిల్ రాజ్ బ్యానర్ లోనే సినిమా ఒప్పకున్నాడు. గతేడాది దిల్ రాజ్ బ్యానర్లో చేసిన "లవర్" అట్టర్ ఫ్లాప్ అయింది. ఐతే ఇపుడు ఒక రీమేక్ మూవీ చేస్తున్నాడు.

టర్కీలో హిట్టయిన "లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్" అనే సినిమా రీమేక్ హక్కులను దిల్‌రాజు చాలా కాలం క్రితమే కొన్నారు. ఆ సినిమాని మొదట గల్లా జయదేవ్ కుమారుడితో తీయాలని ప్లాన్ చేశారు. ఐతే గల్లా జయదేవ్ కొడుకు సినిమా ఆగిపోయింది. కారణమేంటో తెలియదు.

అదే కథని ఇపుడు కొంత మార్చి రాజ్ తరుణ్ కి సూట్ అయ్యే విధంగా మలిచారట. లవర్ టైమ్‌లో రాజ్ తరుణ్ దిల్ రాజుపై అలిగాడు. తనని దిల్ రాజు అవమానించాడని ఫీల్ అయ్యాడు. ఐతే అవన్నీ మనసులో పెట్టుకుంటే ఇపుడు కెరియర్ నడవదని గ్రహించి.. టాప్ నిర్మాత బ్యానర్లో మళ్లీ మూవీ చేస్తున్నాడు.