రాజ్ త‌రుణ్ ఖాతాలో మ‌రోటి

Raj Tarun okays Vijay Kumar Konda film
Wednesday, May 22, 2019 - 13:30

విజ‌యాలు లేక రేసులో వెన‌క‌బ‌డ్డాడు రాజ్ త‌రుణ్‌. అత‌నితో సినిమాలు తీసేందుకు నిర్మాత‌లు ముందుకు రావ‌డం లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాంటి టైమ్‌లో దిల్‌రాజే మ‌రోసారి ధైర్యంగా కొత్త సినిమాని మొదలుపెట్టాడు. దాంతో రాజ్ త‌రుణ్‌కి కూడా ధైర్యం వ‌చ్చింది. తాజ‌గా  “గుండె జారీ గల్లంతయ్యిందే” ద‌ర్శ‌కుడు కొండా విజయ్ కుమార్ చెప్పిన క‌థ‌కి ఓకే చేశాడ‌ట‌.

విజ‌య్ కుమార్ కొండా చైత‌న్య‌తో తీసిన సినిమా ఫ్లాప్ అయింది. దాంతో అప్ప‌ట్నుంచి అత‌నికి అవ‌కాశాలు రావ‌డం లేదు. మూడేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఫ్లాప్‌ల్లో ఉన్న రాజ్ త‌రుణ్ ఛాన్స్ ఇస్తున్నాడు. 

వయసులో పెద్దదైన యువతిని ప్రేమించే ఒక యువ‌కుడి క‌థ‌గా ఈ సినిమా రూపొంద‌నుంది. ఆ యువకునిగా రాజ్ తరుణ్ న‌టించ‌నున్నాడట‌. రాజ్ తరుణ్ ప్ర‌స్తుతం దిల్‌ రాజు నిర్మిస్తున్న “ఇద్దరి లోకం ఒకటే” అనే మూవీ షూటింగ్‌లో ఉన్నాడు.