కుక్క‌లతో ఆడుకుంటానంటున్న హీరో

Raj Tarun reveals his pet hobby
Tuesday, December 11, 2018 - 01:00

సినిమాల్లేకపోతే ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సినీజనాల దగ్గర కొన్ని స్టాక్ ఆన్సర్స్ ఉంటాయి. కొత్త కథలు వింటున్నానని కొందరు చెబుతారు. సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి, త్వరలోనే చెబుతానంటారు మరికొందరు హీరోలు. అయితే రాజ్ తరుణ్ మాత్రం  డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. సినిమాల్లేకపోతే మా ఇంట్లో కుక్కలతో ఆడుకుంటానంటున్నాడు ఈ లవర్ బాయ్. 

రెండు రోజులుగా ట్విట్టర్ లో అభిమానులతో టచ్ లో ఉన్నాడు ఈ హీరో. వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్, రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాడు. ప్రస్తుతం సినిమాల్లేవు కదా, ఖాళీగా ఏం చేస్తున్నావ్ అనే అర్థం వచ్చేలా పరోక్షంగా ప్రశ్న సంధించాడు. దీనిపై రాజ్ తరుణ్ చాలా ఓపెన్ గా రియాక్ట్ అయ్యాడు. తన ఇంట్లో 13 కుక్కలున్నాయని, ఖాళీ దొరికినప్పుడల్లా వాటితో ఆడుకుంటానని అంటున్నాడు. 

మరోవైపు తన సినిమాలపై కూడా స్పందించాడు ఈ హీరో. తన సినిమాల్లో ఏ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ప్రశ్నకు స్పందిస్తూ.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందని రియాక్ట్ అయ్యాడు.