రాజ్ తరుణ్... పెళ్లి మళ్లీ వాయిదా

Raj Tarun will get married in 2022
Monday, December 16, 2019 - 22:15

సరిగ్గా 6 నెలల కిందటి సంగతి. ఖాళీగా ఉంటూ నెటిజన్లతో ట్విట్టర్ లో చాట్ చేశాడు. వచ్చే ఏడాది, అంటే 2020లో పెళ్లి చేసుకుంటానని అప్పుడు ప్రకటించాడు. కట్ చేస్తే, ఈ గ్యాప్ లో మళ్లీ మనసు మార్చుకున్నాడు. 2022 వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ప్రకటించాడు రాజ్ తరుణ్.

లాంగ్ గ్యాప్ తర్వాత ఇతడు నటించిన 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజ్ తరుణ్.. 2022 వరకు పెళ్లి చేసుకోనని స్పష్టంచేశాడు. అతడిలా మరో రెండేళ్ల పాటు తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఓ రీజన్ ఉంది. రాజ్ తరుణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యాడు.

ఇద్దరిలోకం ఒకటే రిలీజ్ కు రెడీ అయింది. త్వరలోనే ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత రానా నిర్మాతగా డ్రీమ్ గర్ల్ అనే రీమేక్ చేయబోతున్నాడు. అటు అన్నపూర్ణ స్టుడియోస్, గీతాఆర్ట్స్-2 బ్యానర్లపై కూడా సినిమాలకు కమిట్ అయ్యాడు. అందుకే పెళ్లిని ఏకంగా రెండేళ్లు వాయిదా వేశాడు రాజ్ తరుణ్.