రాజావారు రాణిగారు బావున్నారుగా!

Raja Varu Rani Garu Teaser is impressive
Monday, July 8, 2019 - 22:30

టీజ‌ర్‌, ట్ర‌యిల‌ర్స్‌తో ఆక‌ట్టుకుంటే చాలు.. చిన్న చిత్రాల‌కైనా మంచి ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. "బ్రోచేవారెవురురా", "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌" వంటి సినిమాల విజ‌యాలు ప్రూవ్ చేశాయి. అదే స్ఫూర్తితో మ‌రో చిన్న చిత్రం కొత్త‌గా త‌న టీజ‌ర్‌ని క‌ట్ చేసింది. ఈ సినిమా పేరు "రాజావారు రాణిగారు". ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ సోమ‌వారం విడుద‌లైంది. 

బుర్ర‌క‌థ చెప్పిన‌ట్లుగా హీరో, హీరోయిన్‌, వారి ఫ్రెండ్స్‌ని ప‌రిచ‌యం చేసింది ఈ టీజ‌ర్‌. 

"ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ ర‌వి కూడా ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా,"రన్నారు నిర్మాత మ‌నోవికాస్‌. "నా పేరు ర‌హ‌స్య‌. సినిమా చాలా బావుంటుంది. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుందం"టోంది హీరోయిన్‌.

మీ అంద‌రికీ టీజ‌ర్ బాగా న‌చ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీ మీ అంద‌రికి ఒక ఫ్రెష్ అనుభ‌వాన్ని ఇస్తుంది అని అన్నారు ద‌ర్శ‌కుడు ర‌వి .

హీరో మాట్లాడుతూ... "ఇంత‌కు ముందు నేను రెండు వెబ్‌సిరీస్‌లో చేశాను. అప్పుడు కొంచం టెన్స‌ణ్ ఉండేది కాని ఇప్పుడు అది లేదు. మాకు ఇంత మంచి స‌పోర్ట్ ఇస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా రెండు, మూడు నెల‌ల్లో విడుద‌ల‌వుతుంది."