ఇక పెళ్లి ప‌నుల్లో రాజ‌మౌళి

Rajamouli busy with son's wedding
Sunday, December 9, 2018 - 14:45

రాజ‌మౌళి ఇక పెళ్లి ప‌నులతో బిజీ కానున్నారు. రాజ‌మౌళి కుమారుడు ఎస్‌.ఎస్‌.కార్తీకేయ జ‌గ‌ప‌తిబాబు అన్న‌య్య కూతురు పూజని పెళ్లాడ‌నున్నాడు. వీరిది కూడా డెస్టినేష‌న్ వెడ్డింగ్గే. ప్ర‌స్తుతం రాజ‌మౌళి త‌న ఆర్‌.ఆర్‌.ఆర్ మొద‌టి షెడ్యూల్‌ని పూర్తి చేసి, షూటింగ్‌కి లాంగ్ బ్రేక్ ఇచ్చాడు. 

పెళ్లి ప‌నుల‌న్నీ పూర్త‌యిన త‌ర్వాతే కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. అంటే సంక్రాంతి త‌ర్వాతే ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్ మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కు జ‌క్క‌న్న పెళ్లి సంబరాల్లోనే ఉంటాడు. 

ఎస్‌.ఎస్‌.కార్తీకేయ ఇప్ప‌టికే లైన్ ప్రొడ్యుస‌ర్‌గా, రాజ‌మౌళి చిత్రాల‌కి స‌హాయ ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తాని ప్రూవ్ చేసుకున్నాడు. అఖిల్ వంటి కొన్ని సినిమాల‌కి మేకింగ్, ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌ర్తించాడు. తాజాగా ఆకాశ‌వాణి అనే సినిమాతో నిర్మాత‌గా మారాడు. జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడు పూజ‌తో ప్రేమ‌లో ప‌డి..ఇరువైపులా పెద్ద‌ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాడు. పూజ భ‌క్తిగీతాల పాట‌ల‌తో పాపుల‌ర్ అయ్యాడు.