కొత్త వాళ్ళతో రాజమౌళి సినిమా!

Rajamouli opens about movie with newcomers
Monday, December 30, 2019 - 18:00

రాజమౌళి స్టార్స్ తో సినిమాలు తీస్తారు. సునీల్ వంటి కమెడియన్ లతో కూడా మూవీస్ చేసినా జక్కన్న ... రాంక్ న్యూ కమార్స్ తో సినిమా తీసే సాహసం చెయ్యలేదు. ఎందుకు? ఈ విషయంపై రాజమౌళి స్పందించారు. 'మత్తు వదలరా' సినిమా ప్రచారంలో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చింది. ఏదైనా కథ ప్రకారమే నడుచుకుంటానని, స్క్రిప్ట్ కొత్త హీరోను డిమాండ్ చేస్తే, కచ్చితంగా కొత్త హీరోతోనే సినిమా చేస్తానని ప్రకటించారు. అంతేతప్ప, కొత్తహీరోలతో కూడా హిట్ కొట్టగలనని నిరూపించుకోవడం కోసం సినిమా చేయనని సమాధానం వచ్చింది ఆయన నుంచి.  

అలాగే, మహాభారతం సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. తను మహాభారతం ప్రాజెక్టు చేస్తాననేది రూమర్ కాదని, అది నిజమన్నారు. కాకపోతే కేవలం ఏదో ఒక పార్ట్ తీసుకొని సినిమా చేయడం తనకిష్టం లేదంట, మహాభారతం మొత్తాన్ని సిరీస్ గా చేయాలనేది డ్రీం. అది ఎప్పటికి సాకారం అవుతుందో తనకు కూడా తెలియదంటున్నారు జక్కన్న. 

తన సినిమాలపై చాలా అంచనాలుంటాయని, అందుకే తనపై కూడా చాలా ఒత్తిడి ఉంటుందని అంటున్నారు రాజమౌళి. అయితే దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుంటానని చెబుతున్నారు. ఎక్కువ మంది జనాలు అంచనాలు పెట్టుకుంటున్నారంటే, ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయని.. అలా తను ఒత్తిడ్ని హ్యాండిల్ చేస్తానంటున్నారు. జనాల అంచనాల్ని నియంత్రించడం మన చేతిలో లేదని... బెస్ట్ గా పనిచేశామా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఒక్కటే మన చేతిలో ఉందంటున్నారు.