రాజ‌మౌళి ఖాతాలో క‌బ‌డ్డీ జ‌ట్టు!

Rajamouli's family owns Kabaddi league
Monday, September 3, 2018 - 16:00

క‌బ‌డ్డీ ఆట‌కి మ‌ళ్లీ క్రేజ్ పెర‌గుతోంది. ఈ ఆట‌కి కూడా ప్రీమియ‌ర్ లీగ్‌లు స్టార్ట్ అయ్యాయి తెలుగునాట‌. తెలంగాణ క‌బ‌డ్డి ప్రీమియ‌ర్ లీగ్‌లో న‌ల్గొండ జ‌ట్టుని కొన్నాడు రాజ‌మౌళి కొడుకు కార్తీకేయ‌. ఈ జ‌ట్టులో ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి కూడా భాగ‌స్వామి. ఇక ఈ జ‌ట్టుకి మెంటార్‌గా ఉండేందుకు రాజ‌మౌళి అంగీక‌రించ‌డం విశేషం.

రాజ‌మౌళి కుటుంబం ఇటీవ‌ల త‌మ డ‌బ్బును వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. బాహుబ‌లి సినిమాల త‌ర్వాత వ‌చ్చిన మొత్తంతో హైద‌రాబాద్‌లోనూ, వైజాగ్‌లోనూ స్థ‌లాలు కొనేశాడు రాజ‌మౌళి. గ‌చ్చిబౌలిలో ఒక భారీ క‌మ‌ర్షియ‌ల్ స్పేస్‌లోనూ రాజ‌మౌళి పెట్టుబ‌డులు పెట్టాడు. ఇపుడు క‌బ‌డ్డి లీగ్‌లోకి వ‌చ్చింది రాజ‌మౌళి కుటుంబం.