భర్త కోసం జీవిత తిప్పలు

Rajasehkar lands in trouble again
Thursday, December 19, 2019 - 15:00

డాక్టర్ కం యాక్టర్ రాజశేఖర్ ...డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానుంది. ఇప్పటికే తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పైనుంచి ఆర్డర్స్ వస్తే... రాజశేఖర్ లైసెన్స్ హుష్ కాకి. ఈ గోల నడుస్తుండగానే... రాజశేఖర్ ఇటీవల ఒక ఫంక్షన్లో వచ్చిరాని తెలుగులో తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఇది గ్యారంటీగా రాజశేఖర్ ని చిక్కుల్లో పడేస్తుంది. 

భాష రాకపోవడం వాళ్ళ వచ్చిన తిప్పలు ఇవి. దానికి తోడు... రాజశేఖర్ రాష్ డ్రైవింగ్ గురించి చాలా కంప్లైంట్ లు ఉన్నాయి. దాంతో జీవిత తన భర్తపై ఈగ వాలకుండా చూసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతోంది అంట. మందు తీసుకొని తన భర్త ఎప్పుడు డ్రైవ్ చెయ్యలేదని... ఆయన చాల బాధ్యతతో బిహేవ్ చేస్తారని ఆమె చెప్తున్నారు.