మాకి రాజశేఖర్ రూ. 10 లక్షల విరాళం

Rajasekhar donates Rs 10 lakhs to MAA
Saturday, September 14, 2019 - 17:45

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త బాడీ ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఆర్నెళ్లల్లోనే లుకలుకలు మొదలయ్యాయి. అధ్యక్షుడు నరేష్‌కి వ్యతిరేకంగా రాజశేఖర్‌ అండ్‌ టీమ్‌ ముఠా కట్టిందనేది గుసగుస. ఆ వార్తలను ఒక ప్రెస్‌నోట్‌లో "ఖండించారు" (గాయం సినిమాలో కోట డైలాగ్‌లా చదువుకోగలరని నోట్‌).

ఐతే తన ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు రాజశేఖర్‌ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇపుడు మరో గూగ్లీ విసిరాడు. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని తన వంతుగా రాజశేఖర్... రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించాడు. అంటే ఇన్‌డైరక్ట్‌గా ఇతరులపై ఒత్తిడి పెంచడమే. 

మా అసోషియేషన్‌ తరఫున మరిన్ని నిధుల కోసం చారిటీ ఈవెంట్స్‌ కూడా నిర్వహిస్తారట.