నేను తాగి సెట్‌కి ఎపుడూ రాలేదు: రాజేంద్ర‌ప్ర‌సాద్‌

Rajednra Prasad says he never came to the sets drunk
Sunday, June 30, 2019 - 14:00

స‌మంత హీరోయిన్‌గా న‌టించిన ఓ బేబీ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర పోషించారు. ల‌క్ష్మీకి ఫ్రెండ్‌గా ఉండే పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో స‌మంత‌ని, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డిని త‌న ఓవ‌ర్ యాక్ష‌న్ తో చాలా ఇబ్బంది పెట్టాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ఒక రోజు ఈ సినిమా సెట్‌కి తాగేసి వ‌చ్చాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. 

దీనిపై రాజేంద్ర‌ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఓ బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చాలా సేపు మాట్లాడిన రాజేంద్ర‌ప్ర‌సాద్ ....త‌న‌దైన శైలిలో త‌న న‌ట‌న గురించి త‌న డ‌బ్బా తాను కొట్టుకొని... దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సినిమాలో సున‌య‌న పాత్ర‌తో తన‌కి ఉన్న కొన్ని సీన్ల సంద‌ర్భంగా బాగా తాగిన‌ట్లు న‌టించాల‌ట‌. 

"నాకు ఎన్టీఆర్ స్ఫూర్తి. ఆయ‌న ఏదైనా ఒక పాత్ర చేసిన‌పుడు ఎపుడూ ఆ మూడ్‌లోనే ఉన్న‌ట్లు క‌నిపించేవారు. షూటింగ్ లేని టైమ్‌లోనూ ఆ పాత్ర ప్ర‌వ‌ర్త‌న‌తోనే క‌నిపించేవారు. అంత డెడికేష‌న్ ఉండేది. నేను ఆ స్కూల్ నుంచి వ‌చ్చిన‌వాడినే. సున‌య‌న‌తో నాకు ఈ సినిమాలో ఓ సీన్ ఉంది. అందులో తాను తాగిన‌ట్లు న‌టించాలి. దాంతో ఆ రోజంతా అలా సెట్‌లోనూ, ఆఫ్‌స్ర్కీన్‌లోనూ అలా ప్ర‌వ‌ర్తించాను. దాంతో కొంద‌రు నేను తాగి సెట్‌కి వ‌చ్చాను అని భ్ర‌మ‌పడ్డారు. దాన్ని యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టారు. నేను షూటింగ్‌కి తాగి వ‌చ్చిన‌ట్లు ఏదేదో రాశారు. 42 ఏళ్ల కెరియ‌ర్‌లో నేను ఎపుడు తాగి షూటింగ్‌కి రాలేదు", ఇలా క్లారిఫికేష‌న్ ఇచ్చారు సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌.