జూలై 18న రాక్ష‌సుడు రాక‌

Rakashasudu to release on July 18
Saturday, June 1, 2019 - 14:45

త‌క్కువ టైమ్‌లోనే ప్ర‌త్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.  ఈ యువ హీరో న‌టిస్తున్న కొత్త చిత్రం..."రాక్ష‌సుడు. రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ఇది. 

ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

"దిస్ మ్యాన్ స‌ఫ‌రింగ్ ఫ్ర‌మ్ యాంటీ సోష‌ల్ డిజార్డ‌ర్‌.. సింపుల్‌గా చెప్పాలంటే వాడొక సైకో.. వాడికి నొప్పంటో ఏంటో తెలియ‌ద‌నుకుంటా...రాక్షసుడు" అనే డైలాగ్ త‌ప్ప మ‌రే డైలాగ్ లేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, సీనియ‌ర్ న‌టుడు సూర్య‌, ఓ చిన్న‌పాప .. టీజ‌ర్‌లో క‌న‌ప‌డే పాత్ర‌లు.  చిన్న పిల్ల‌ల‌ను ముఖ్యంగా అమ్మాయిల‌ను క్రూరంగా హింసించి చంపే ఓ సైకోను పోలీస్ ఆఫీస‌ర్ మ‌ధ్య న‌డిచే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గేమ్ ఇది అని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. 

బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత‌ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నాడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 18న విడుద‌ల చేస్తున్నారు.