స్పైడర్ దెబ్బ నుంచి కోలుకున్నట్టేనా?

Is Rakul coming out of bad phase?
Sunday, December 30, 2018 - 10:30

విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ అయింది స్పైడర్ సినిమా. ఈ సినిమా ఎఫెక్ట్ నుంచి హీరో మహేష్, దర్శకుడు మురుగదాస్ త్వరగానే కోలుకున్నారు కానీ రకుల్ పై మాత్రం ఆ దెబ్బ గట్టిగా పడింది. అప్పటికే ఫ్లాప్ హీరోయిన్ అనే ఇమేజ్ తో ఉన్న రకుల్ ను స్పైడర్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సినిమా తర్వాత పత్తాలేకుండా పోయిన రకుల్, లాంగ్ గ్యాప్ తర్వాత మెల్లమెల్లగా మరోసారి తెలుగుతెరపైకి వచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ చిన్న వేషం కట్టింది. బయోపిక్ లో శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను తీసుకున్నారు. ఆమెపై ఓ సాంగ్, ఓ సీన్ తీశారు.

ఈ సినిమా తర్వాత మెల్లగా మూవీస్ ఒప్పుకోవడం స్టార్ట్ చేసింది రకుల్ త్వరలోనే నితిన్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించే ఛాన్స్ ఉంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీలో నితిన్ సరసన రకుల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రకుల్ కు తెలుగులో ఈ సినిమా దాదాపు రీఎంట్రీ లాంటిదనే చెప్పుకోవాలి.