బిగ్ బాస్ హౌజ్ లోకి రకుల్

Rakul to enter Bigg Boss 3 House
Thursday, August 1, 2019 - 07:45

సినిమాల కోసం బిగ్ బాస్ హౌజ్ ను వాడుకోవడం కొత్తకాదు. గడిచిన రెండు సీజన్లలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు, దర్శకుడు తమ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌజ్ ను వాడుకున్నారు. మరి సీజన్-3లో ఆ పని చేసే మొదటి హీరో ఎవరు? ఇంకెవరు స్వయంగా బిగ్ బాసే తన హౌజ్ ను తన సినిమా కోసం వాడుకోబోతున్నాడు.

అవును.. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న మన్మథుడు-2 సినిమా కోసం బిగ్ బాస్ సీజన్-3ను ప్రచారం కోసం వాడుకోబోతున్నాడు నాగ్. ఇందులో భాగంగా తన హీరోయిన్ రకుల్ ను హౌజ్ లోకి పంపించబోతున్నాడు. ఈ మేరకు అంతా కలిసి ఓ మాట అనుకున్నారు. డేట్ మాత్రం ఫిక్స్ చేయాల్సి ఉంది. రకుల్ కనుక హౌజ్ లోకి ఎంటరైతే.. బిగ్ బాస్ సీజన్-3ని ప్రమోషన్ కోసం వాడుకున్న మొదటి సినిమాగా మన్మథుడు-2 నిలుస్తుంది.

బిగ్ బాసులు ఇలా హౌజ్ ను వాడుకోవడం కొత్తేంకాదు. సీజన్-1కు బిగ్ బాస్ గా వ్యవహరించిన ఎన్టీఆర్, జై లవకుశ సినిమా కోసం బిగ్ బాస్ హౌజ్ ను వాడుకున్నాడు. సీజన్-2కు బిగ్ బాస్ గా చేసిన నాని కూడా దేవదాస్ కోసం హౌజ్ ను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే పని చేస్తున్నాడు. ఆగస్ట్ 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది.