50 ప్ల‌స్ హీరోలైతేంటి?

Rakul opens up about senior stars
Wednesday, May 1, 2019 - 19:00

సీనియ‌ర్ హీరోల‌కి స‌రిజోడు అనిపించుకునే హీరోయిన్లు దొర‌క‌డం గ‌గ‌న‌మైంది. న‌య‌న‌తార‌, అనుష్క త‌ప్ప మిగతా హీరోయిన్లు ఎవ‌రూ చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న స‌రిపోవ‌డం లేదు. 

ర‌కుల్, త‌మ‌న్న‌లే ఇపుడు ఆప్స‌న్‌గా మారారు. అందుకే ర‌కుల్‌కిపుడు డిమాండ్ పెరిగింది. ర‌కుల్ కూడా 50 ప్ల‌స్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నిస్తోంది. ఏ హీరోతో అయినా చేసే న‌ట‌న అదే క‌దా అనేది ఆమె మాట‌.

ప్ర‌స్తుతం ఆమె 59 ఏళ్ల నాగార్జున‌కి ప్రియురాలిగా న‌టిస్తోంది "మ‌న్మ‌ధుడు 2" చిత్రంలో. ఇక బాలీవుడ్‌లో 51 ఏళ్ల అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న "దే దే ప్యార్ దే" చిత్రంలో యంగ్ ల‌వ‌ర్‌గా న‌టించింది.